🙏OM NAMO SRI MUNESWARAYA NAMAHA 🙏

07-03-2026 – శనివారం

రెండవ రోజు

అభిషేకం అనేది శ్రీ మునేశ్వర స్వామివారికి భక్తిశ్రద్ధలతో నిర్వహించే అత్యంత పవిత్రమైన మరియు విశిష్టమైన సేవ. ఈ సేవలో స్వామివారిని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చందనం మరియు పవిత్ర జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకం చేస్తారు. అభిషేక సమయంలో వేద మంత్రాలు, నామస్మరణలు మరియు దివ్య స్తోత్రాలతో స్వామివారి మహిమను స్మరించుకుంటారు.

అభిషేక సేవ ద్వారా భక్తులు శారీరక-మానసిక శుద్ధిని పొందుతారని విశ్వసించబడుతోంది. ఈ పవిత్ర పూజ ఆయురారోగ్యాలు, కుటుంబ శ్రేయస్సు, ఐశ్వర్యం మరియు మనోశాంతిని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలు, కష్టాలు మరియు అవరోధాల నుండి విముక్తి పొందేందుకు అభిషేకం చేయించడం శుభప్రదంగా భావించబడుతుంది.

జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాల సందర్భాలలో మరియు మొక్కుబడి ఉన్న భక్తులు స్వామివారికి అభిషేకం చేయిస్తుంటారు.

అభిషేక ఫలితాలు:
ఆయురారోగ్య ప్రాప్తి, కష్ట నివారణ,

శాంతి మరియు ఐశ్వర్యం.

అభిషేకం

ఉభయదారులు

గౌనివారి మునివెంకటప్ప భార్య మంగమ్మ మాజీ సర్పంచ్ కు|| ఎం. మునిబాబు భార్య రత్నమ్మ

గౌనివారి మునివెంకటప్ప భార్య మంగమ్మ కు॥ రమేష్ మాజీ సర్పంచ్, వెండుగంపల్లి

మురుగేష్ భార్య (నందిని) నాగకన్య, కుప్పం

తిక్కప్ప గారి శంకరప్పకు॥ ఎస్.మునెప్పు, ఎస్.లోకేష్, వెండుగంపల్లి

కావలి ఓబన్న కు|| ఒ. చంద్రప్ప కు|| సి. హరిక్రిష్ణ, కాంట్రాక్టర్, వెండుగంపల్లి

తిక్కప్ప గారి మునస్వామి కు॥ఎం. మురుగేష్, వెండుగంపల్లి

రాజేంద్ర కు|| వేణు, బలబందకొట్టాలు

తోమాల సేవాలు

తోమాల సేవ అనేది శ్రీ మునేశ్వర స్వామివారికి అంకితమైన ఒక పవిత్ర సేవ. “తోమాల” అనగా పుష్పమాలలు. ఈ సేవలో స్వామివారికి తాజా పుష్పాలతో తయారు చేసిన అందమైన పుష్పమాలలను సమర్పించి స్వామివారిని అలంకరించడం జరుగుతుంది.

ఈ సేవలో ముందుగా దేవాలయంలో అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, అనంతరం వివిధ రకాల సువాసన గల పుష్పాలతో స్వామివారిని అలంకరిస్తారు. పుష్పాల సువాసనతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి భక్తులకు దివ్యానుభూతిని కలిగిస్తుంది.

సేవ ఫలితాలు:

దైవ కృప మరియు ఆశీర్వాదం
• కుటుంబ శాంతి మరియు ఐశ్వర్యం
• ఆధ్యాత్మిక ఆనందం
• మనోభిలాషల నెరవేర్పు

సమర్పించువారు:

డీలర్ లేట్ క్రిష్ణమూర్తి భార్య శాంతమ్మకు|| కె.గిరిబాబు, కె. హేమంత్ కుమార్ భార్య ఉష, కె. బేతన్ కుమార్ భార్య ఉమా, వెండుగంపల్లి, గోవిందరాజు భార్య కె. ప్రభావతి, క్రిష్ణగిరి.

కీ॥శే॥ గాజుల పట్టాభి నాయుడు గారి భార్య గాజుల రాజమ్మ గారు, కుప్పం

కొండ చుట్టూ ఊరేగింపు ఉత్సవం అనేది భక్తులు తమ వ్యక్తిగత సంకల్పాలు, కోరికల నెరవేర్పు మరియు కుటుంబ శ్రేయస్సు కోసం నిర్వహించుకునే పవిత్రమైన ఆచారం. ఈ ఉత్సవంలో ముందుగా దేవాలయంలో శ్రీ మునేశ్వర స్వామివారికి విశేష అలంకారం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి.

అనంతరం పలకవాద్యం మరియు మంగళవాయిద్యాలతో స్వామివారిని భక్తులు తమ భుజాలపై ఘనంగా ఊరేగింపుగా తీసుకువెళ్లి కొండ చుట్టూ ప్రదక్షిణగా తిరుగుతున్నపుడు పలుమార్లు కొబ్బరికాయలతో స్వామివారికి దిష్టి తీసి హారతులు సమర్పింస్తారు..

భక్తుల విశ్వాసం ప్రకారం, ఈ విధంగా కొండ చుట్టూ స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లడం ద్వారా వారి జీవితంలో ఉన్న దోషాలు, కష్టాలు మరియు అడ్డంకులు తొలగి దైవ కటాక్షం లభిస్తుందని నమ్ముతారు.

స్వామివారి దివ్య ఆశీర్వాదంతో భక్తుల కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు సుఖసంతోషాలు కలుగుతాయని విశ్వసించబడుతుంది. భక్తి భావంతో ఈ ఉత్సవాన్ని నిర్వహించిన వారు స్వామివారి కృపకు పాత్రులై సర్వమంగళాలను పొందుతారని నమ్మకం.

ఉత్సవ ఫలితాలు:

• దైవ కృప మరియు రక్షణ లభిస్తుంది
• జీవితంలోని కష్టాలు, అడ్డంకులు తొలగుతాయి
• కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం పెరుగుతుంది
• ఆరోగ్యం మరియు సుఖసంతోషాలు కలుగుతాయి

కొండచుట్టు - ఉత్సవం

ఉభయదారులు

  1. వెంకటప్ప కు॥ ఆర్.వి. వెంకటేష్ కె.జి.ఎఫ్. పూజారప్పకొట్టాలు

  2. హంసక్కగారి మునస్వామి కు॥ వెంకటేష్ అల్లుడు వినోద్, ధర్మరాజులకొట్టాలు

  3. లేట్ దొర్లప్ప కు॥ డి. మల్లప్ప భార్య రాజేశ్వరి చిన్నవసనాడు

  4. బయ్యప్ప కు|| బాలరాజు, గుట్టపల్లి గోనుగూరు

ఉత్సవం అనేది దైవానుగ్రహాన్ని స్వగృహానికి ఆహ్వానించే పవిత్రమైన ఆచారం. శ్రీ మునేశ్వర స్వామివారిని దేవాలయం నుండి అలంకరించి, మంగళ వాయిద్యాల నాదంతో ఘనంగా తమ భుజాల మీద ఊరేగింపుగా తీసుకువచ్చి భక్తుల గృహం వద్ద / పొలం వద్ద దించి పూజించడం ఎంతో శుభప్రదం.

స్వామివారు గృహం వద్దకు ప్రవేశం చేయడం అనగా ఆ కుటుంబానికి దైవ కటాక్షం ప్రత్యక్షంగా లభించడం అనే భావన. కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించి తమ మనోభిలాషలను వినయపూర్వకంగా ప్రార్థిస్తారు.

భక్తుల విశ్వాసం ప్రకారం, స్వామివారు ఇంటి వద్దకు / పొలం వద్దకు విచ్చేసి దివ్య ఆశీర్వాదం ప్రసాదిస్తే ఆ కుటుంబానికి ఉన్న దోషాలు, చెడు ప్రభావాలు, అడ్డంకులు తొలగి శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖసంతోషాలు కలుగుతాయి.

కుటుంబంలో ఐక్యత పెరిగి, సంతానం అభివృద్ధి చెందుతూ, గృహంలో సౌభాగ్యం నెలకొంటుందని భక్తులు నమ్ముతారు.

ఉత్సవ ఫలితాలు:
• కుటుంబ శ్రేయస్సు
• దైవ కృప
• శాంతి మరియు సౌభాగ్యం
• ఆధ్యాత్మిక ఆనందం

ఉత్సవం

ఉభయదారులు:

  1. కరుగుమెటు మునివెంకటప్ప కు॥ బయ్యప్ప కుమారులు ధర్మరాజులు కొటాలు

  2. స్వామి నాథన్ భార్య గౌరమ్మ కు|| తిరుపతి భార్య రాజేశ్వరి, లోచనశ్రీ నారాయణపురం

  3. పూజారి మునెప్పకు॥ శంకరప్ప పూజారప్పకొట్టాలు

  4. గోవిందప్ప కు|| రాజేంద్ర, అమ్మవారిపేట

  5. ఓంశక్తి గుడి బీమప్ప కు॥ ధర్మ కు॥ మణికంఠ, నాగేంద్ర, ధర్మరాజులకొట్టాలు

  6. ఓంశక్తి గుడి బీమప్ప కు॥ నాగరాజు, మునిరాజు, ధర్మరాజులకొట్టాలు

  7. పొట్లెప్ప గారి గౌని మునస్వామి, బైరప్పకొట్టాలు

  8. కనుగు మానింటి వెంకటేష్ కుమారులు ధర్మరాజులుకొట్టాలు

  9. తిక్కప్ప గారి మునస్వామి కు॥ మురుగేష్, వెండుగంపల్లి

  10. పూజారి గొవిందప్ప కు॥ పి.జి.రామక్రిష్ణ, పి.జి.భూపతి, పి.జి.జయరాం పూజారప్పకొట్టాలు

హారికథ

ఉభయదారులు

రైస్ మిల్ వెంకటేష్ భార్య లక్ష్మీ, బి.సి.కాలనీ

హరికథ అనేది భగవంతుని లీలలు, పురాణ కథలు మరియు భక్తి సందేశాలను సంగీతం, శ్లోకాలు మరియు కథల రూపంలో భక్తులకు వినిపించే పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమం. హరికథ వినడం ద్వారా భక్తులు ధర్మం, నీతి మరియు భక్తి మార్గాన్ని తెలుసుకొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు

ప్రాకారం అనగా గర్భాలయాన్ని చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం లేదా ఆవరణ. ఈ ప్రాకారం చుట్టూ స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లడాన్నే ప్రాకారోత్సవం అంటారు. ఈ ఉత్సవంలో ముందుగా దేవాలయంలో శ్రీ మునేశ్వర స్వామివారికి విశేష అలంకారం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి.

అనంతరం పలకవాద్యం వాయిద్యాలు మరియు మంగళవాయిద్యాలతో స్వామివారిని భక్తులు తమ భుజాలపై ఘనంగా ఊరేగింపుగా తీసుకువెళ్లి దేవాలయ ప్రాకారం చుట్టూ ప్రదక్షిణగా తిరుగుతారు.

ఈ సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి హారతులు సమర్పించి తమ మనోభిలాషలను ప్రార్థిస్తారు. ఈ ప్రాకారోత్సవంలో పాల్గొనే భక్తులు శ్రీ మునేశ్వర స్వామివారి దివ్య ఆశీర్వాదాన్ని పొందుతూ శాంతి, ఐశ్వర్యం మరియు ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తారని విశ్వసించబడుతోంది.

ఉత్సవ ఫలితాలు:

• దైవ కృప మరియు రక్షణ

• కష్టాలు, అడ్డంకుల నివారణ

• కుటుంబ శాంతి మరియు ఐశ్వర్యం

• ఆధ్యాత్మిక శాంతి మరియు ఆనందం

ప్రాకారోత్సవం

ఉభయదారులు

  1. చంద్రకాంత్ Happy Mobiles మరియు సతీష్, కుప్పం

  2. రాజు భార్య పుష్ప కు|| తిషాన్, కుప్పం

  3. సి.మాణిక్యం, క్రిష్ణప్ప గౌడు, చిన్నవసనాడు

  4. మురళి భార్య యల్లమ్మ, ఉర్లఓబనపల్లి పాపాచెరువు

  5. గుల్లేపల్లి మునెప్పకు॥ ఎంశరవణ, ఎం.గోవిందరాజులు, ఎం.వేలు, ఎం.తిరుపతి, శ్రీసాయిగ్రానైట్స్, ఓంగోలు

Get in touch

Address

Vendugampalle Village, Kuppam mandal, Chittoor Districct, Andhra Pradesh 517425

Contacts

9494 28 4400